KMM: ఖమ్మం రీజియన్ పరిధిలోని 7 డిపోలలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. అక్టోబర్ 9న జరిగే ఈ ఎన్నికల్లో 12 యూనియన్లు పాల్గొంటుండగా, ప్రధాన కూటముల మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కార్మికులు రాష్ట్ర, రీజియన్ స్థాయిలలో ఓట్లు వేయనున్నారు. కాగా, ఈ రీజియన్ పరిధిలో మొత్తం 1804 మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
హోరాహోరీగా ఎన్నికల ప్రచారం..!


