MNCL: కళాకారులకు న్యాయం చేయాలని హైదరాబాదులో నిర్వహించే రవీంద్ర భారతి ముట్టడికి భారీగా తరలి రావాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు కొండుకూరి రాజు కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. సెప్టెంబర్ 30న రవీంద్ర భారతి ముట్టడిని నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ
'రవీంద్ర భారతి ముట్టడికి భారీగా రావాలి'


