NGKL: కల్వకుర్తి పట్టణంలోని జెపి నగర్ తండ దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెనకనుంచి వచ్చిన కారు బొలెరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: బొలెరో వాహనాన్ని ఢీకొన్న కారు


