హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతుల విజ్ఞప్తి

MBNR: మిడ్జిల్ మండలం ఈదులబావి తండాలో విద్యుత్ సమస్యతో రైతులు, గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మోటార్ల కోసం డీడీలు చెల్లించి నెలలు గడుస్తున్నా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించాలని కోరారు.