హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే ఉద్యాన ప్రాజెక్ట్‌పై భారీ డ్రోన్ షో

ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రాజెక్ట్‌పై ఇవాళ RISE ఇంజనీరింగ్ కాలేజీలో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నారని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సాయంత్రం 7:30 గంటలకు జరిగే ప్రదర్శనలో ప్రాజెక్ట్ ప్రణాళికలను డ్రోన్ల కాంతులతో దృశ్యరూపంలో చూపించనున్నారు. ప్రజలు ,యువత అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.