హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామిడిలో శ్రీ భోగేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ

ATP: సంకటహర చతుర్థి, మంగళవారం పురస్కరించుకుని పామిడి ఆలయంలో శ్రీ భోగేశ్వరస్వామి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామివారికి వేకువజామునే విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.