హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి'

PPM: వెంకంపేట పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైసీపీ మండల స్థాయి విస్తృత సమావేశం సోమవారం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధమై గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జోగారావు సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల్లో ఉండాలని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.