VSP: విశాఖలో ఇక ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పరీక్ష రాసే అవకాశం కల్పించినట్లు RDO శ్రీనివాస్ తెలిపారు. సారథి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఓటీపీ తప్పనిసరి అన్నారు. ఫీజు చెల్లించిన తర్వాత ల్యాప్‌టాప్‌లో పరీక్ష రాయాలి. ఏఐ నిఘా ఉండటంతో నిబంధనలు ఉల్లంఘిస్తే పరీక్ష రద్దవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష


