హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో రోడ్డుపై వృథాగా మంచినీరు

BPT: బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్డులో మంచినీరు వృథాగా రోడ్డుపైకి చేరుతోంది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఎదురుగా రఫీ ఎలక్ట్రానిక్స్‌ వద్ద మంగళవారం నీరు రోడ్డంతా ప్రవహించి డ్రైనేజీలోకి వెళ్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. మంచినీరు వృథా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.