హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి మండపంలో వెరైటీ అన్నదానం

కోనసీమ: సాధారణంగా వినాయక చవితి మండపాల వద్ద నిర్వహించే అన్నదానంలో ఒకటి లేదా రెండు రకాల స్వీట్స్ ఉంటాయి. కానీ అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన వారు అందుకు భిన్నంగా అన్నదానం చేశారు. గ్రామంలోని సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఆన్నదానంలో ప్రతి విస్తరిలో రూ. 30 రకాల స్వీట్లతో భోజనం వడ్డించారు. అలాగే, భక్తులు ఇంటికి తీసుకెళ్లేందుకు కవర్లు కూడా పంపిణీ చేయడం విశేషం.