AKP: ఇటీవల కురిసిన వర్షాలతో శారదా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల్లోని కాలువలు, చెరువులకు నీరు చేరుతోంది. నారాయణపురం, గోకివాడ, ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లోని పొలాలకు సాగునీటి లభ్యత మెరుగుపడనుంది. సమృద్ధిగా నీరు అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలతో శారదా నదికి జలకళ


