SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మానేరు నది తీరాన ఉన్న తన వ్యవసాయ పొలం వద్ద బొల్లారపు శంకరయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మృతికి గల కారణాలు, ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మానేరు నది తీరంలో వ్యక్తి మృతదేహం లభ్యం


