హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డొకిపర్రులో పోషణ మాసం అవగాహన

కృష్ణా: పోషణ మాసం సందర్భంగా గుడ్లవల్లేరు మండలం డొకిపర్రు అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూపర్‌వైజర్ నసీరున్నిసా పాల్గొని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహారంపై వివరించారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పోషకాహారం, దాని ప్రాధాన్యతను వివరించారు.