హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట బోదెలోకి దూసుకెళ్లిన బొలెరో

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బొండాయికోడు తూము వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తుని నుంచి రొయ్యల మేత లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి పంట బోదె లోకి దూసుకెళ్లింది. వాహనంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.