హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నెలాఖరులోగా విద్యుత్ బకాయలు చెల్లించాలి'

PLD: మాచర్లలో ఈ నెల 30వ తేదీ సాయంత్రంలోగా విద్యుత్ బకాయలు చెల్లించాలని విద్యుత్ శాఖ EE సింగయ్య వినియోగదారులకు కోరారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కమర్షియల్, నివాస గృహాలు, వ్యవసాయ కనెక్షన్ సంబంధించి పాత బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.