హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్: కలెక్టర్

ATP: జిల్లాలోని ప్రతి గ్రామంలో కనీసం ఒక స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి QR కోడ్ ఆధారిత వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పైలట్‌గా అమలు చేయాలని తెలిపారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.