హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు విద్యార్థులకు ఓ టీచర్‌

SKLM: కవిటి మండలం బింగిపుట్టుగ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం రెండో తరగతిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండేది. విలీన ప్రక్రియలో భాగంగా 3, 4, 5 తరగతులను పెద్దఎర్రగోవిందపుట్టుగ పాఠశాలలో విలీనం చేయడంతో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులకు బోధించేందుకు ఒక ఉపాధ్యాయిని, వంట మనిషి ఉన్నారు.