ప్రకాశం: కంభం ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా మైదానం మద్యం సేవించే వారికి అడ్డాగా మారిందని వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు పడేయడంతో విద్యార్థులు, క్రీడాకారులు, వాకర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పగులగొట్టిన మద్యం సీసాలతో ప్రమాదం పొంచి ఉందని వారు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలేజీ మైదానంలో మందుబాబుల హల్ చల్


