హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లాకు నూతన అధికారి

మార్కాపురం జిల్లా ఉపాధి అధికారిగా గోన కోటేశ్వరరావు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. SEEDAP DDU-GKY 2.0 ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందించనున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు. యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.