హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

NLR: వరికుంటపాడు మండలంలోని రామాపురంలో మంగళవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో NH -565 పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లీంపులు అమలు చేయనున్నట్లు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఇవాళ రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వేరే మార్గాల్లో మళ్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.