హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

BHNG: రాజాపేట మండలంలోని మల్లగూడెంకు చెందిన పసుపుల మమత (28) కుటుంబ కలహాలతో సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ తఖియుద్దీన్‌ వివరాల మేరకు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామన్నారు.