ASR: చింతపల్లి మండలం బెన్నవరం గ్రామపంచాయతీ పరిధిలోని రేగాళ్ల గ్రామంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఎప్పుడూ కనిపించని విధంగా మంచు కురవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండగా, ఉదయం మంచుతో గ్రామం అందంగా కనిపించింది. అయితే వాహనదారులకు రహదారి కనిపించక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ఎన్నడూ లేనంత పొగమంచుతో 'రేగాళ్ల'


