SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట పంచాయతీలోని వరం (నవభారత్) కాలనీలో తాగునీటి సరఫరా కొళాయిలు మరమ్మతులకు గురయ్యాయి. కాలనీలో సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండేళ్లుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండేళ్లుగా తాగునీరు లేక అవస్థలు


