హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వచ్చే నెల 1న పింఛన్ల పంపిణీ: డీఆర్డీఏ పీడీ శచీదేవి

AKP: జిల్లాలో వచ్చే నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 2,50,168 మంది పెన్షనర్లకు ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. బ్యాంకుల సమ్మె వాయిదా పడిన నేపథ్యంలో ఉదయం నుంచే పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 30న బ్యాంకుల నుంచి నగదు తీసుకోనున్నట్లు తెలిపారు.