హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షాలు

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాతావరణ మార్పుల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాల సమయంలో ప్రజలు ఉరుములు, మెరుపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.