హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్‌

SKLM: మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సోమవారం అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలు, డాగ్‌ స్క్వాడ్‌ సేవలను వినియోగించాలని సూచించారు. రవాణా, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలన్నారు.