హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో పందిరికి అంటుకున్న మంటలు

GNTR: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎదురుగా ముఖద్వారానికి అనుసంధానమైన పందిరికి సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.