హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేడు ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణ

ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతపురం జిల్లాలో 1723 పాఠశాలల్లో, సత్యసాయి జిల్లాలో 2034 పాఠశాలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఎస్ఎంసీ ఎన్నికల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది.