హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌లో వ్యర్థాలు వేయొద్దు: మంత్రి

కృష్ణా: మంగినపూడి బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వినాయక నిమజ్జనోత్సవాల అనంతరం బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాల తొలగింపు పనుల్లో ఆయన పాల్గొన్నారు. సముద్రంలో వ్యర్థాలు వేయడం వల్ల సముద్ర జీవరాశులకు, సందర్శకులకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.