హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో బాధపడుతూ మహిళ ఆత్మహత్య

JGL: గొల్లపల్లి మండలం శంకర్రావుపేటలో గాజుల లత (48) అనే మహిళ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జీవితంపై విరక్తితో ఈ ఘటనకు పాల్పడినట్లు ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి తెలిపారు. మృతురాలి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.