హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న నలుగురి అరెస్ట్

SKLM: కొత్తూరు మండలం కురిగాం గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.15,770 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.