ప్రకాశం: బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కిషన్ అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కిషన్ మృతదేహాన్ని రెండు రోజుల్లో స్వగ్రామానికి తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
విధి నిర్వహణలో ఆర్మీ ఉద్యోగి మృతి


