హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3 కేజీల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్

కాకినాడ సూర్యనారాయణపురం రైల్వేగేటు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు కాకినాడ మూడో పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.