హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల కలెక్టరేట్‌లో ఉచిత వైద్య శిబిరం

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ ప్రదీప్‌కుమార్, డాక్టర్ పి.సిద్ధార్థ తదితరులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతీలో సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆయుష్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.