హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెపండుగ-3.0ను విజయవంతం చేయాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో వారం రోజుల పాటు పల్లెపండుగ-3.0 కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బీటీ, సీసీ రోడ్లు, రహదారి సౌకర్యం లేని ఆవాసాలకు కనెక్టివిటీ పనులను చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు.