హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ తీగలు తగిలి మహిళ మృతి

PPM: మండలంలోని సంగంవలస పంచాయతీ నడిమివలసలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగలడంతో బి.జానకమ్మ (50) మృతిచెందారు. ఈ ఘటన విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీపీఐ (ఎంఎల్‌) రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సంగం ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు, తీగలను సరిచేయాలని డిమాండ్‌ చేశారు.