హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాల క్యాంప్ కార్యాలయంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 99 మందికి రూ.54.79 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం అందజేశారు. ఆచంట నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం సీఎం సహాయ నిధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.