హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపే నరసరావుపేటలో జాబ్ మేళా

PLD: నరసరావుపేట శ్రీనివాస ఐటీఐ కళాశాలలో రేపు ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 12 కంపెనీలు పాల్గొననున్న ఈ మేళాలో రూ.13 వేల నుంచి రూ. 35 వేల వరకు వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. 18–35 ఏళ్ల యువతీ యువకులు రెజ్యూమ్, ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌తో హాజరుకావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తిమ్మాజీ రావు తెలిపారు.