VZM: సంతకవిటి మండలం లింగాపురం గ్రామానికి చెందిన ప్రమిళారాణి (27) గ్యాస్ లీకేజీతో చీరకు నిప్పంటుకుని చికిత్స పొందుతూ సోమవారం కేజీహెచ్‌లో మృతిచెందారు. ఈ నెల 16న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తండ్రి తిరుపతిరావు ఫిర్యాదుతో ఎస్సై గోపాలరావు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్యాస్ లీకేజీ ఘటనలో మహిళ మృతి


