హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓవర్‌లోడ్‌ టిప్పర్‌కు భారీ ఫైన్

AKP: వేంపాడు వద్ద సోమవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అధిక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ లారీని గుర్తించారు. తుని నుంచి నక్కపల్లి వైపు రాళ్ల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా నిబంధనలకు మించి సరుకు ఉన్నట్లు తేలింది. దీంతో టిప్పర్‌ను ఆర్టీఓ అధికారులకు అప్పగించగా, రూ.54 వేల జరిమానా విధించినట్లు సీఐ జె.మురళి తెలిపారు.