హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువల మూసివేతతో దుకాణంలోకి నీరు

VZM: కొత్తవలసలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి విజయనగరం రోడ్డులోని ఓ కిరాణా దుకాణం నీట మునిగింది. వీరసాగరం కాలువలను శాశ్వతంగా మూసివేయడంతో వర్షపు నీరు దుకాణంలోకి వస్తోందని నిర్వాహకులు వాపోయారు. దుకాణంలోని సరుకులు తడిసి పాడవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.