GNTR: ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కారు ఢీకొని యువకుడు మృతిచెందాడు. నల్లపాడు పోలీసుల వివరాల మేరకు కొప్పరావూరుకు చెందిన పి.గణేష్(20) స్నేహితుడు అఖిల్‌తో కలిసి గుంటూరు వస్తుండగా లాం వద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణబాజి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


