VZM: జిల్లా రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ, RPF పోలీసులు సోమవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన చింతామణి ముదిలి, సుధం ముదిలి అనే ఇద్దరు వ్యక్తులు రూ.9 లక్షల విలువైన 18 కిలోల గంజాయిని గుజరాత్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి రైల్వే కోర్టుకు తరలించినట్లు ఎస్సై బాలాజీరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత


