హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాద్రి ప్లాంట్‌లో సాంకేతిక సమస్య

AKP: సింహాద్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. 500 MW సామర్థ్యం గల 3వ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి హఠాత్తుగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఇంజినీర్లు వెంటనే రంగంలోకి దిగి సమస్యను సరిచేసేందుకు మరమ్మతులు చేపట్టారు. మిగిలిన మూడు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోందని ప్లాంట్‌ అధికారులు తెలిపారు.