E.G: సీతానగరం-4 అంగన్వాడీ కేంద్రంలో పిల్లలను లోపలే ఉంచి గడియ పెట్టిన ఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అంగన్వాడీ కార్యకర్త జి. ఉమా మహేశ్వరి, ఆయా టి. లావణ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ సిబ్బందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు


