కృష్ణా: ప్రత్యేక విధులకు బస్సులను కేటాయించడంతో అవనిగడ్డ పరిధిలో మంగళవారం పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది. అవనిగడ్డ–విజయవాడ కరకట్ట మార్గంలో నడిచే బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు డిపో మేనేజర్ కె. హనుమంతరావు తెలిపారు. ఇతర రూట్లలో కొన్ని సర్వీసులను పాక్షికంగా నిలిపివేస్తామని చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు యథావిధిగా నడుస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవనిగడ్డ–విజయవాడ కరకట్ట బస్సుల రద్దు


