NTR: వత్సవాయి మండలంలోని వరి సాగు చేసిన గ్రామాల్లో ఇవాళ ఎలుకల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, గ్రామ సచివాలయాల వద్ద మందును అందజేస్తామని అన్నారు. పంట నష్టాన్ని నివారించేందుకు రైతులందరూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పొలాల్లో ఎలుకలను సమర్థంగా నివారించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ'


