కృష్ణా: గుడివాడలోని నెహ్రూ చౌక్‌లో వన్‌టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్సైలు సీహెచ్ అవినాష్, కుమార్ రాజా వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, తదితర పత్రాలను పరిశీలించారు. హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై


