హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సమస్యలపై 109 ఫిర్యాదులు

TPT: ఏపీఎస్పీడీసీఎల్ 'డయల్ యువర్ సీఎండీ', 'డయల్ యువర్ ఎస్ఈ' కార్యక్రమాలకు 109 వినతులు అందినట్లు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ హెచ్చుతగ్గులు, స్తంభాలు, లైన్ల మార్పు, వ్యవసాయ సర్వీసుల మంజూరుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. 1912,1800 425 155333 టోల్ ఫ్రీ నంబర్లు, 91333 31912 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.