హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్‌ గేమ్స్‌ సెలక్షన్స్‌కు సిద్ధం

VSP: ఈనెల 30న స్కూల్‌ గేమ్స్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్‌ తెలిపారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సంబంధించి బాక్సింగ్‌, చెస్‌, జూడో, టేబుల్‌ టెన్నిస్‌, హ్యాండ్‌బాల్‌ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు ఫెడరేషన్‌ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు.